వైరల్ అవుతున్న మహేష్ కొత్త పిక్

వైరల్ అవుతున్న మహేష్ కొత్త పిక్

Published on May 26, 2024 6:55 PM IST

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఐతే, తాజాగా మహేష్ కొత్త లుక్ ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తోంది. మహేష్ ఈ పిక్ ను పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్ కి లక్షల లైక్‌ లు వచ్చాయి. తన కుమారుడు గౌతమ్ కాన్వకేషన్‌కు హాజరైన మహేష్, తన కొడుకుతో కలిసి ఈ ఫోటో దిగాడు. మొత్తానికి ఈ లేటెస్ట్ లుక్ లో మహేష్ బాబు పొడవాటి జుట్టు మరియు మందపాటి గడ్డంతో కనిపించి షాక్ ఇచ్చాడు.

రాజమౌళి సినిమాలో మహేష్ ఇదే లుక్‌ లో కనిపిస్తాడని టాక్. ఇక రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా స్టార్ట్ కానుంది. కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది.

ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కానీ రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు