80%పైగా పూర్తైన మహేష్ బాబు ‘శ్రీ మంతుడు’

Mahesh-babu
‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘శ్రీ మంతుడు(వర్కింగ్ టైటిల్)’. ఇటీవలే మలేషియా లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేష్ బాబు పై వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు పై షూట్ చేస్తున్న ఓ మేజర్ ఎపిసోడ్ మరియు ఒక పాట మాత్రమే బాలన్స్ ఉందని ఈ చిత్ర టీం అంటోంది. జూన్ రెండవ వారం లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఈ చిత్ర టీం తెలిపింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ బాబుకి ఓ సూపర్ హిట్ ఇవ్వాలని కొరటాల శివ చాలా పర్ఫెక్ట్ గా ఈ సినిమాని తీస్తున్నాడు. శ్రీ మంతుడు అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తున్నా ఆ టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31న ఈ సినిమా అధికారిక టైటిల్ ని అనౌన్స్ చెయ్యడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు సరసన మొదటి సారి హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని జూలై 17న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

Exit mobile version