మహేష్ బాబు కుమారుడు నటుడిగా మారనున్నడా?

మహేష్ బాబు కుమారుడు నటుడిగా మారనున్నడా?

Published on Feb 17, 2013 11:40 AM IST

Mahesh-babus-son

ప్రస్తుత తరం టాలీవుడ్ అందగాడు మహేష్ తన తరువాత తరం వారసుడు గౌతమ్ ని తెలుగు సినీ తెరకు పరిచయం చెయ్యబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. గౌతమ్ బాల నటుడిగా ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యిందంట.సుకుమార్ తాజా చిత్రంలో నటిస్తున్న మహేష్ చిన్ననాటి పాత్రకు గౌతమ్ ను అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతానికి గౌతంతో తాజా ఫోటోషూట్ నిర్వహించినా, ఇంకా అధికారకంగా విడుదల కావాల్సివుంది.

‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో లాంచ్ లో గౌతమ్ కనబడినప్పటి నుండీ గౌతమ్ ను నటుడిగా పరిచయం చేయడానికి ఆలోచిస్తున్నారా అని చాలా మంది మహేష్ బాబుని ప్రశ్నిస్తున్నారు. కానీ అడిగిన ప్రతీసారి గౌతమ్ ఇంకా చిన్న పిల్లాడే అని మహేష్ మాట దాటేస్తున్నాడు. నిజానికి గౌతమ్ కనుక సుకుమార్ సినిమాలో నటిస్తే అందరి ప్రశ్నకూ సమాధానం దొరికినట్టే. ఈ సినిమాలో కృతి సనన్ మహేష్ సరసన నటిస్తుంది. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గోపీచంద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు