సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్, పాటలు రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చిన మహేష్ బృందం ఇప్పుడు ప్రీరిలీజ్ వేడుకకు రెడీ అవుతోంది. జనవరి 5న జరగనున్న ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో అటు మహేష్ అభిమానుతో పాటు మెగాస్టార్ అభిమానులు కూడా వేడుకకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
కాబట్టి నిర్వాహకులు ఏర్పాట్లను భారీగా, చాలా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మహేష్ తాజాగా అభిమానులతో ఫోటోషూట్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా హాజరయ్యారు. వారిని కంట్రోల్ చేయడం నిర్వాహకులకు చాలా కష్టమైంది. చివరికి చాలామంది అభిమానులు మహేష్ బాబును కలవకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కనుక మెగాస్టార్, మహేష్ ఇద్దరూ ఒకే వేదికపై ఇండబోయే ప్రీరిలీజ్ వేడుకలో అలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఈవెంట్ నిర్వాహకులు, మహేష్ టీమ్ గతంలో కంటే అధిక జాగ్రత్తలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
