మహేష్ బాబు ధైర్యం వెనుక కారణం అతనే

మహేష్ బాబు ధైర్యం వెనుక కారణం అతనే

Published on Oct 18, 2019 11:00 PM IST

రాబోయే సంక్రాంతి పోటీకి మహేష్ బాబు, అల్లు అర్జున్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా ‘అల వైకుంఠపురం’ నిర్మాతలు జనవరి 12న వస్తున్నట్టు ప్రకటించగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా అదే 12ను విడుదల తేదీగా అనౌన్స్ చేశారు ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాతలు. దీంతో క్లాష్ మొదలైంది. సాధారణంగా మహేష్ వసూళ్లను దెబ్బతీసే ఇలాంటి పోటీకి దూరంగానే ఉంటారు. అలాంటిది ఈసారి హెడ్ టు హెడ్ అన్నట్టు ఆయనే బరిలోకి దూకడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఇండస్ట్రీ టాక్ మేరకు మహేష్ 12వ తేదీన రావాలని పట్టుబట్టడానికి కారణం, లెక్క తప్పితే తీవ్ర నష్టమని తెలిసినా వెనుకాడకపోవడానికి రీజన్ దర్శకుడు అనిల్ రావిపూడేనట. అనిల్ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చూసి ఎట్టి పరిస్థితుల్లో సినిమా బాగుంటుందని మహేష్ ఫిక్స్ అయిపోయారట. పైగా సినిమా ఎంటెర్టైనింగ్ జానర్.

అనిల్ రావిపూడి గత సంక్రాంతి సీజన్లో ‘ఎఫ్ 2’ సినిమాతో వచ్చి పెద్ద సినిమాలనే అధిగమించి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. ఆ చిత్రంతో ప్రేక్షకుల్లో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. ఈ కారణాలే మహేష్ అతని మీద ఇంత నమ్మకం ఎర్పరుచుకునేలా చేసి ఉండవచ్చు. మరి సూపర్ స్టార్ నమ్మకాన్ని రావిపూడి ఎంతమేరకు నిలబెట్టుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు