ఆరోజు కోసం మహేష్ ఫ్యాన్స్ పిచ్చ వెయిటింగ్.!

Published on May 30, 2020 12:02 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తం మూడు వరుస బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చిన అనంతరం దర్శకుడు పరశురామ్ తో మొదలు పెట్టనున్న ప్రాజెక్ట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

గత కొన్ని నెలల పాటు ఎన్నో సంశయాల నడుమ ఈ ప్రాజెక్ట్ ఒకే కావడం అందులోను ఈ ప్రాజెక్ట్ ను ఈ మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా రాబోతున్న అధికారిక అప్డేట్ కోసం ఇప్పుడు వీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘సర్కార్ వారి పాట” అని టాక్ బయటకు రావడంతో ఇదే టైటిల్ ను ఆరోజు ప్రకటించినట్టైతే ఆరోజు సోషల్ మీడియాలో మోత మోగించాలని ఫిక్స్ అయ్యిపోయారు. మొత్తానికి మాత్రం ఆరోజు కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More