“సర్కారు వారి పాట” తెలుగు ట్యాగ్ తో రచ్చ చేస్తున్న మహేష్ ఫాన్స్.!

sarkaru vaari paata

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా కావడం పైగా దీనిని అనుకోని రీతిలో పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండడంతో ఇంతకు ముందు మహేష్ చేసిన ఏ సినిమాపై కూడా రాని హైప్ ఈ చిత్రానికి వచ్చింది.

అయితే ఇక సోషల్ మీడియా ట్రెండ్స్ అంటే మహేష్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో దుమ్ము లేపుతారో తెలిసిందే. అందులో భాగంగానే మొట్ట మొదటి సారిగా ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని 100 మిలియన్ హ్యాష్ ట్యాగ్ టైటిల్ రికార్డును వీరు సొంతం చేసుకున్నారు. మరి ఈరోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవం అనో లేక ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యిందనో..

మొత్తానికి కారణం ఏదైనా “సర్కారు వారి పాట” తెలుగు టైటిల్ ట్యాగ్ ను మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో నేషనల్ లెవెల్ ట్రెండింగ్ లో పెట్టారు. దీనితో పాటుగా ఇంగ్లీష్ ట్యాగ్ గా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. తెలుగులో అయితే 40వేలకు పైగా ట్వీట్స్ తో గట్టిగానే రచ్చ చేస్తున్నారు. అలాగే ఇదే సమయంలో మేకర్స్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగనుందో చూడాలి.

Exit mobile version