మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్ అట..!

మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్ అట..!

Published on Mar 22, 2020 11:11 AM IST

Mahesh Babu

మహేష్ ఫ్యాన్స్ కి ఈ సంక్రాంతి పెద్ద పండుగ పంచింది. సరిలేరు నీకెవ్వరు రూపంలో మహేష్ నుండి వారు అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేశారు. ఇక మహేష్ ఈ చిత్రం తరువాత వంశీ పైడిపల్లితో సినిమాకి కమిట్ అయినా, ఆ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఈ మూవీ ఆగిపోవడాన్ని మహేష్ ఫ్యాన్స్ ఆస్వాదించారు. వంశీ పైడిపల్లి టాలెంటెడ్ దర్శకుడు అయినప్పటికీ మహేష్ మరో దర్శకుడితో చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ విషయం ఫ్యాన్స్ కి బాగానే అనిపించింది.

ఐతే మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తారు అనేది ఇక్కడ అసలు పాయింట్. మహేష్ ప్రస్తుతం దర్శకుల నుండి కథలు వింటున్నాడని తెలుస్తున్న తరుణంలో ఆయన ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ నుండి కూడా ఆయన కథలు వింటున్నారట. మహేష్ ఫ్యాన్స్ అయితే ఆయన నెక్స్ట్ మూవీ దర్శకుడు ఎవరవుతారని ఆసక్తిగా గమనిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు