మహేష్ సినిమా టైటిల్ రిలీజ్ డేట్..!

Mahesh-Babu-Koratala-Shiva
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్నుంచీ కొంత కన్ఫ్యూజన్ ఉంది. మొదట ఈ సినిమాకు ‘మగాడు’ అన్న టైటిల్ వినిపించింది. అయితే ఆ తర్వాత సినిమా కథానుగుణంగా ‘శ్రీమంతుండు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వినిపించింది. ఇప్పటివరకూ ఇదే టైటిల్ ప్రచారంలో ఉంటూ వస్తోంది.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ‘శ్రీమంతుడు’ అని కాకుండా ‘మగాడు’ అనే కంటిన్యూ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోందని మళ్ళీ ప్రచారం జరిగింది. ఈ కన్ఫ్యూజన్లన్నింటికీ సినిమా యూనిట్ నేడు తెరదించింది. మే 31న విడుదల కానున్న మహేష్ సినిమా టీజర్, పోస్టర్స్‌తో పాటే టైటిల్ కూడా విడుదల చేయనున్నారు. ‘మగాడు’ అనే టైటిల్ అసలు పరిశీలనలోనే లేదన్న విషయం తెలుస్తోంది. మరి మహేష్ సినిమా టైటిల్ ఏమై ఉంటుందన్న విషయం తెలియాలంటే మే 31వరకూ ఆగాల్సిందే. మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య లాంటి భారీ తారాగణమే ఉన్నారు. జూలై 17న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version