బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ లేటెస్ట్ కామెంట్స్!

mahesh
మహేష్ బాబు.. కేవలం తెలుగు సినిమాలతోనే దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన హీరో. ఒక్క హిందీ సినిమా చేయకున్నా దేశవ్యాప్తంగా నిర్వహించే పలు సర్వేల్లో బాలీవుడ్ స్టార్‌లను సైతం పక్కనపెట్టి టాప్‌లో నిలవడం, పలు ప్రముఖ నేషనల్ లెవల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఎంపికవ్వడం వంటివి మహేష్ క్రేజ్‌కు నిదర్శనం. ఇక ఇప్పటికే చాలా బాలీవుడ్ అవకాశాలే వచ్చినా, తెలుగు సినిమాలే తన ప్రాధాన్యత అని తెలుపుతూ వచ్చిన మహేష్, మరోసారి ఈ విషయంపై తనదైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఓ ప్రముఖ తెలుగు న్యూస్ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. “బాలీవుడ్‌లో సినిమా చేయాలన్న ఆలోచనైతే లేదు. నేను ఇక్కడే ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది. మనం ఇక్కడే గొప్ప సినిమాలు తీయాలి. మన తెలుగు సినిమా గురించి అక్కడ మాట్లాడుకోవాలి. అదే నా డ్రీమ్ కూడా. ఈమధ్యే బాహుబలితో తెలుగు సినిమా స్టామినా అందరికీ తెలిసింది. ఇక్కడే మనం గొప్ప గొప్ప సినిమాలు చేయగల అవకాశం ఉన్నపుడు అక్కడికి వెళ్ళడం ఎందుకనిపిస్తుంది” అని తెలిపారు. ఇక ఈ మధ్యే విడుదలైన ‘శ్రీమంతుడు’ సక్సెస్‌తో సూపర్ హ్యాపీగా ఉన్న మహేష్ సెప్టెంబర్ నెలలో తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ను మొదలుపెట్టనున్నారు.

Exit mobile version