సర్కారు వారి పాటలో మహేష్ సరికొత్త లుక్.

Published on May 31, 2020 9:18 am IST

అనుకున్నట్లుగానే మహేష్ తన ఫ్యాన్స్ కి కోరుకున్న గిఫ్ట్ ఇచ్చే చేశారు. కొన్ని నెలలుగా వారి నిరీక్షణకు తెరదించుతూ కొత్త మూవీ ప్రకటన చేశారు. నేడు ఉదయం 09:09 నిమిషాలకు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. నేడు మహేష్ తండ్రిగారైన కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మహేష్ కీలక ప్రకటన చేశారు.

ముందుగా ప్రచారం అయినట్టు ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారు. చెవికి ఫోగు, మెడపై రూపాయి నాణెం టాటూ తో మహేష్ సరికొత్త లుక్ అదిరింది. మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి.

సంబంధిత సమాచారం :

More