మహేష్ మరో కొత్త వ్యాపారం మొదలెట్టారా?

మహేష్ మరో కొత్త వ్యాపారం మొదలెట్టారా?

Published on Jul 27, 2019 7:20 PM IST

మహేష్ మరో బిజినెస్ మొదలుపెట్టనున్నారా…? ఆయన తాజా చర్యలతో ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. మహేష్ బాబు ఆల్రెడీ మల్టీ ప్లెక్స్ వ్యాపారంలో ఉన్నారు. గచ్చిబౌలి ప్రాతంలో ఏ ఎం బి సినిమాస్ పేరుతో మల్టీ ఫ్లెక్స్ సముదాయం నిర్మించి దానిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. . ‘మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి’ అంటూ ఓ వెబ్‌సైట్‌ను మహేశ్‌ బృందం పోస్ట్‌ చేసింది. దీన్ని మహేశ్‌ తిరిగి షేర్‌ చేశారు.

ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్‌ ఉంచారు. ఈ పేజ్‌లో కింది భాగంలో దుస్తుల రకాలు, బ్రాండ్‌లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్‌లైన్‌ షాపింగ్ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతుంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు