‘ఏమాయ చేశావే’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన చెన్నై సుందరి సమంత పుట్టిన రోజు నేడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సమంత తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’లో జత కట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు సమంతకు స్పెషల్ విషెస్ చెప్పారు. ఈ రోజు ’బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన మహేష్ బాబు గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ మహేష్, సమంతలు కలిసి ఉన్న మరో పోస్టర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సరసన హీరోయిన్ గా ‘అ..ఆ’ సినిమాలో నటిస్తున్న సమంతకు ‘అనసూయా రామలింగం’ అంటూ ఆమె పాత్ర పేరుతో విషెస్ చెపుతూ హీరో నితిన్ కూడా ‘అ..ఆ’ సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సమంత కు విషెస్ చెప్పినవారిలో హీరోలు సూర్య, రామ్ లతో పాటు త్రిష, రకుల్ ప్రీత్, హన్సికకూడా ఉన్నారు.
ఇక సమంత గురించి చెప్పాలంటే… ఏప్రిల్ 28, 1987 న చెన్నైలో జన్మించిన సమంత అసలు పేరు సమంత రుతు ప్రభు. తల్లి మళయాలీ కాగా తండ్రి తెలుగువారు. సినిమాలపై ఆసక్తితో ‘ఏమాయ చేశావే’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తరువాత ’బృందావనం’, ’దూకుడు’, ’ఈగ’, ’ఎటో వెళ్ళిపోయింది మనసు’, ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ’అత్తారింటికి దారేది’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’, ‘మనం’ సినిమా లో మంచి నటనను కనబరిచింది. అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదగడంతో పాటు అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే సంవత్సరంలో అందుకున్న నటిగా కూడా సమంత రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సమంత నితిన్ తో ‘అ.. ఆ’ సినిమాలో నూ, మహేష్ బాబు తో ‘బ్రహ్మోత్సవం’ లోనూ నటిస్తుండగా సూర్య తో నటించిన ’24’ సినిమా వచ్చే నెల 6 విడుదల అవుతున్నది. సమంత పుట్టినరోజు సందర్భంగా 123తెలుగు.కాం తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.
Happy birthday @Samanthaprabhu2… Have a great year 🙂 pic.twitter.com/Gg5Q2jcB0E
— Mahesh Babu (@urstrulyMahesh) April 28, 2016
Wishing my Anasuya Ramalingam @Samanthaprabhu2 and my superkool friend n my fav costar a verryy happyy buddayy..?? pic.twitter.com/YQLmoiblOF
— nithiin (@actor_nithiin) April 28, 2016