రాజకుమారుడు,రాఘవేంద్రుడు తో చొట్ట బుగ్గల ప్రీతి

రాజకుమారుడు,రాఘవేంద్రుడు తో చొట్ట బుగ్గల ప్రీతి

Published on Jul 30, 2019 11:54 AM IST

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రం 20ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ అభిమానులు ఓ ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహేష్ బాబు, ప్రీతి జింటాలకు ఓ సన్నివేశంలో ఎలా నటించాలో చూపిస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఉన్నఆఫోటో ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

మహేష్ బాబు, ప్రీతి జింటా జంటగా దర్శకుడు రాఘవేంద్ర రావు తెరెకెక్కించిన రాజకుమారుడు మూవీ జులై 30 1999 లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మూడురెట్ల వసూళ్లతో 16కోట్లు సాధించింది. మహేష్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఈ చిత్రంలో తెరంగేట్రం చేశారు. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఆయన స్వరపరచిన ఆరు పాటలు యూత్ ని ఆకట్టుకొని చాలా రోజులు ట్రెండ్ అయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో మహేష్ తండ్రి పాత్రలో కనిపించడం మరో విశేషం.శ్రీహరి, ప్రకాష్ రాజ్,బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి,ఎం ఎస్ నారాయణ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు