మహేష్ సినిమా రీమేక్ రీరిలీజ్ కి ఊహించని స్పందన

మహేష్ సినిమా రీమేక్ రీరిలీజ్ కి ఊహించని స్పందన

Published on Apr 21, 2024 12:12 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన పలు సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో తన కెరీర్ స్టార్టింగ్ లోనే కొట్టిన క్లాసిక్ చిత్రం “ఒక్కడు” (Okkadu) కూడా ఒకటి. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంని తమిళ్ లో దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ధరణి “గిల్లీ” పేరిట తెరకెక్కించగా అక్కడ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.

అయితే ఈ చిత్రం తాజాగా తమిళ నాట రీ రిలీజ్ (Ghilli Re Release) కి వచ్చింది. ప్రస్తుతం సౌత్ ఇండియా అంతటా రెండు వారాలు నుంచి సరైన సినిమాలు లేక డ్రై గా ఉంది. దీనితో రీ రిలీజ్ కి పలు సినిమాలు వస్తుండగా ఇప్పుడు ఈ రీమేక్ సినిమాని రిలీజ్ చేయగా దీనితో ఊహించని స్పందన నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది.

నిన్న ఒక్క శనివారం లోనే హైయెస్ట్ టికెట్స్ 60 వేలకి పైగా ఈ సినిమావి అమ్ముడుపోయాయని తెలుస్తుంది. మరి ఈ 15 నుంచి ఈ చిత్రం బుకింగ్స్ స్టార్ట్ కాగా ఇపుడు వరకు ఏకంగా 1 లక్ష 50 వేలకి పైగా టికెట్స్ ని కట్ చేసుకుంది. దీనితో మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర రీ రిలీజ్ లలో గిల్లీ బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ రీ రిలీజ్ లలో గిల్లీ కొత్త రికార్డుని సెట్ చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు