గద్దలకొండ గణేష్ చూసిన మహేష్ రియాక్షన్…!

mahesh2

ప్రిన్స్ మహేష్ వరుణ్ తేజ్ లేటెస్ట్ సెన్సేషన్ గద్దలకొండ గణేష్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా మూవీ పట్ల ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. “గద్దలకొండ గణేష్ మూవీ ఆసాంతం ఆస్వాదించాను, గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించారు. దర్శకుడు హరీష్ మంచి ప్రతిభ కనబరిచారు. 14రీల్స్ బ్యానర్ కి అలాగే మూవీ టీం కి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేయడం జరిగింది. మహేష్ లాంటి సూపర్ స్టార్ వరుణ్ చిత్రంపై స్పందించడం ఆ మూవీకి కలిసొచ్చే అంశమే.

గద్దలకొండ గణేష్ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి చంద్ ఆచంట లకు మహేష్ కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు నిర్మించింది వీరే. అలాగే ఈ బ్యానర్ లో మహేష్ నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలలో నటించారు. కాగా గద్దలకొండ గణేష్ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటుంది.

Exit mobile version