సూపర్ స్టార్ మహేష్ ప్రయోగానికి మూడేళ్లు.!

Published on Sep 27, 2020 12:35 pm IST

మన టాలీవుడ్ లో సరికొత్త సబ్జెక్టులను వాటితో పాటుగా మంచి సందేశాత్మక చిత్రాలను అందివ్వడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అలా మహేష్ కెరీర్ లో చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో చేసిన బై లాంగువల్ చిత్రం “స్పైడర్” కూడా ఒకటి. గత 2017లో ఈ చిత్రం ఇదే సెప్టెంబర్ 27 వ తేదీన భారీ అంచనాల నడుమ విదులయ్యింది. మహేష్ కెరీర్ లోనే భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలయ్యింది.

కానీ ఈ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేదు. కమెర్షియల్ గా ఈ చిత్రం సరైన విజయం అందుకోలేదని చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి కూడా మహేష్ చాలా సినిమాల్లానే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమాలో మహేష్ పెర్ఫామెన్స్ ఒకెత్తు అయితే విలన్ చేసిన చేసిన ఎస్ జె సూర్య అయితే ఇంకో ఎత్తు అని చెప్పాలి.

మురుగదాస్ డిజైన్ చేసిన ఈ విలన్ రోల్ అయితే మన టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో ఒక బెస్ట్ సైకో విలన్ రోల్ అని చెప్పాలి. కొన్ని అంశాలను పక్కన పెడితే ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్లో టేక్ చేసారు కానీ ఊహించని విధమైన ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటించగా హరీష్ జైరాజ్ సంగీతం అందించారు. ఇపుడు ఈ ఐకానిక్ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ మరియు అభిమానులు అప్పటిరోజులను గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More