ఫ్రెండ్స్‌కి మహేష్ దీపావళి స్పెషల్ గిఫ్ట్స్!

ఫ్రెండ్స్‌కి మహేష్ దీపావళి స్పెషల్ గిఫ్ట్స్!

Published on Nov 12, 2015 11:10 AM IST

mahesh-gift
‘శ్రీమంతుడు’ సక్సెస్ తెచ్చిపెట్టిన ఉత్సాహంతో తన తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ను శరవేగంగా పూర్తి చేస్తోన్న మహేష్, ఈ దీపావళి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి హైద్రాబాద్‌లోని తన నివాసంలో వైభవంగా జరుపుకున్నారు. ఇక దీపావళి పండుగను పురస్కరించుకొని మహేష్ తన బంధువలకు, ఇండస్ట్రీ మిత్రులకు ప్రత్యేకంగా గిఫ్ట్స్ తయారుచేయించి తన సంతోషాన్ని వాళ్ళతో పంచుకున్నారు. ప్రత్యేకంగా తయారుచేయబడిన పలు ఫుడ్ ఐటెమ్స్‌తో నిండిన ఈ గిఫ్ట్‌ను పంపిస్తూ “మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు” అంటూ మహేష్ తన ఫ్యామిలీ తరపున విషెస్ తెలిపారు.

ఇక కింది ఫోటోలో మహేష్ తన మిత్రులకు పంపించిన స్పెషల్ గిఫ్ట్‌ను చూడొచ్చు. ‘శ్రీమంతుడు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి తెలియజెప్పిన మహేష్ నుంచి ఈ విషెస్ అందుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూండగా, ఆ సినిమా పూర్తైన వెంటనే మురుగదాస్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు