
టాలీవుడ్ లో బిగ్గెస్ట్, హయ్యెస్ట్, ఫాస్టెస్ట్ ఇలా ఎన్ని విశేషణాలు వాడినా బుల్లితెర మీద యాడ్స్ విషయానికి వచ్చేసరికి మహేష్ ని కొట్టే హీరో లేడు. తన సినిమాలతోనే కాక, తను నటిస్తున్న యాడ్ కంపనీల సంఖ్య చేత కూడా పెద్ద పెద్ద హీరోలకు ఈర్ష్య కలిగిస్తున్నాడు.
ఈరోజు టాటా స్కై స్పెషల్ 99 ప్యాక్ విడుదలకు వచ్చిన మహేష్ జక్కన్నతో తన తదుపరి సినిమా విశేషాలు చెప్పాడు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ లో వున్నట్టు, త్వరలోనే కధ ఖరారు కానున్నట్టు తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తే రికార్డులు తానంతట తానే చెదిరిపోవడానికి ఇష్టపడతాయనడం అతిశయోక్తికాదేమో..

