ది బెస్ట్ మేకప్ మెన్ కి మహేష్ స్పెషల్ విషెస్.!

ది బెస్ట్ మేకప్ మెన్ కి మహేష్ స్పెషల్ విషెస్.!

Published on Jul 8, 2021 12:30 PM IST

ఎలాంటి స్టార్ హీరో అయినా స్టార్ హీరోయిన్స్ ని అయినా అత్యంత అందంగా అభిమానులు ఆకట్టుకునే విధంగా చూపించేది వారి మేకప్ టీం మాత్రమే.. అలాగే అదే మేకప్ తో ఎంతో మాయాజాలం చేయగలిగే వారు కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉన్నారు. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తనకి తెలిసిన ది బెస్ట్ మేకప్ మెన్ మీరే అని తన పర్సనల్ మేకప్ మెన్ పట్టాబి గారి గురించి కొనియాడారు.

అయితే ఈరోజు అయన బర్త్ డే సందర్భంగా తన సినిమా “ఖలేజా” నాటి వర్కింగ్ స్టిల్ పెట్టి మహేష్ ఈ రకంగా తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే తన ప్రేమ గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయని మహేష్ తెలిపారు. మరి ప్రస్తుతం మహేష్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” చేస్తుండగా అలాగే తర్వాత త్రివిక్రమ్ తో తమ హ్యాట్రిక్ సినిమాకు సన్నద్ధం అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు