మహేష్ – సుకుమార్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 16, 2019 1:03 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మహేష్ కోసం సుకుమార్ ఓ రొమాంటింక్ యాక్షన్ జోనర్ లో అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ కోసం చిత్రబృందం ఓ స్టార్ హీరోయిన్ని ఫైనల్ చేసే పనిలో వుంది. రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమా కోసం కూడా బాగానే సన్నద్ధం అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :

X