మహేష్ – సుకుమార్ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

mahesh sukumar

సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో తన 26వ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి మొదలు కానుందని తెలుస్తోంది. అయితే మహేష్ ఈ సినిమాకు మే నుండి వరుసగా డేట్లు ఇచ్చారు.

కాగా మహేష్ కాంబినేషన్ లో ఉన్న సీన్లను మే నుండి ఫారెన్ లొకేషన్స్ లో షూట్ చేయనున్నారు. ఇక మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో కథానాయకగా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను తయారు చేశారట. సుకుమార్ చెప్పిన స్క్రిప్ట్ మహేష్ బాబుకు కూడా బాగా నచ్చిందట, అందుకే వెంటనే ఈ సినిమా చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Exit mobile version