సర్కారు వారి పాట పేరిట ఇండియా లెవల్ రికార్డు.

Published on May 31, 2020 12:47 pm IST

సూపర్ స్టార్ మహేష్ ట్రీట్ అదిరిపోయింది. ఆయన నూతన చిత్ర టైటిల్ ఒకెత్తు అయితే ఆయన లుక్ మరో ఎత్తులా ఉంది. మహేష్ ఈ మూవీలో పక్కా మాస్ అండ్ రఫ్ అట్టిట్యూడ్ కలిగిన రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. చెవుకు పోగు, మెడపై రూపాయి కాయిన్ టాటూ చూస్తుంటే ఆయన సరికొత్త మాస్ మసాలా సబ్జెక్టు తో వస్తున్నాడని హింట్ ఇస్తున్నట్లు ఉంది.

ఇక మార్నింగ్ నుండి సర్కారు వారి పాట టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండు అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో విరుచుకుపడుతున్నారు. దీనితో దేశంలోనే తక్కువ టైములో వన్ మిలియన్ ట్వీట్స్ చేసిన టైటిల్ ట్యాగ్ గా సర్కారు వారి పాట నిలిచింది. మరి సాయంత్రం అయ్యేనాటికి ఈ టైటిల్ ఇంకెన్ని రికార్డ్స్ నమోదు చేయనుందో చూడాలి. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More