ప్రకాష్ రాజ్ మాటల కోసం మహేష్ వెయిటింగ్..!

Published on May 27, 2020 2:07 am IST

కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ మరియు నేచర్ పై ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ ఛానల్ డిస్కవరీ ఓ డాక్యూమెంటరీ చేసింది. ఈ ఎపిసోడ్స్ తెలుగు మరియు తమిళంలోకి కూడా అందుబాటులోకి తీసుకువస్తుండగా, ఆ రెండు భాషలకు వాయిస్ ఓవర్ ప్రముఖ నటుడు ప్రకాష్ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ప్రకాష్ రాజ్ ఆ అవకాశం దక్కినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఐతే ప్రకాష్ రాజ్ ట్వీట్ కి హీరో మహేష్ స్పందించారు. కర్ణాటక వైల్డ్ లైఫ్ ఎపిసోడ్స్ కి ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పి, ఆసక్తి వ్యక్తం చేశారు.

ఇక మహేష్- ప్రకాశ్ రాజ్ పలు సినిమాలలో కలిసి నటించారు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో ప్రకాష్ రాజ్ ప్రధాన విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా మహేష్ ఫ్యాన్స్ ఆయన నూతన చిత్ర ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More