
ప్రస్తుతం ఆగడు సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా, ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో బిజీ అవ్వడానికి రెడీగా వున్న మహేష్ బాబు బ్రాండ్ ల ప్రచారంలో టాలీవుడ్ నుండి నెంబర్ 1 హీరోగా వెలుగుతున్నాడు. ఆ బ్రాండ్ లలో సౌత్ ఇండియన్ పాపులర్ ఫూట్ వేర్ సంస్థ ప్యారగాన్ వున్న విషయం తెలిసినదే
ఈ చెప్పుల కంపనీ ప్రచార చిత్ర షూటింగ్ కోసం బుధ – గురు వారాలలో మహేష్ ముంబైలో మకాం వేయనున్నాడు. ఆగడు సినిమాకు కాసింత విరామం దొరకడంతో ఖాళీ సమయాన్ని ఇలా వినయోగించుకున్తున్నాడు మన బిజినెస్ మ్యాన్
ప్రస్తుతం మహేష్ , శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఆగడు సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ఈ సినిమాలో తమన్నా కధానాయిక. శృతిహాసన్ ఒక ప్రత్యేక పాటలో అలరించనుంది. థమన్ సంగీతదర్శకుడు

