మహేష్ మరోసారి అండర్ కవర్ కాప్ ?

mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో కొత్త సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ భారీ హైప్ ఉంది. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ మీద బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే హీరో క్యారెక్టరైజేషన్ మీదే అందరికీ ఎక్కువ ఆసక్తి. అందునా మహేష్ బాబు హీరో కాబట్టి ఆ ఆసక్తి రెట్టింపు ఉంటుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల మేరకు ఇందులో మహేష్ బాబును అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపాలనేది త్రివిక్రమ్ ఆలోచనని తెలుస్తోంది.

అయితే ఇవి నిజమా కాదా అనేదే తేలాల్సి ఉంది. గతంలో మహేష్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసిన ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అందుకే త్రివిక్రమ్ కూడ అలాంటి పాత్రే రాస్తున్నారు అనగానే అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ‘పార్ధు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే వార్తలు ఉన్నా ఇంకా అది కూడ ఫైనల్ కాలేదు. ప్రజెంట్ మహేష్ బాబుకు ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తవగానే ఈ సినిమాను మొదలుపెడతారు.

Exit mobile version