మహేష్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.

మహేష్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.

Published on May 30, 2020 10:07 AM IST

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేపు ఆయన తన అభిమానులతో ముచ్చటించనున్నారు. మహేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఛాట్ చేయనున్నారు. రేపు తన తండ్రిగారైన కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా మహేష్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ సెషన్ లో మహేష్ నెక్స్ట్ మూవీ, టైటిల్, డైరెక్టర్ వంటి అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చే సూచనలను కలవు.

మరో ప్రక్క మహేష్ రేపు తన నూతన చిత్ర ప్రకటన చేస్తారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐతే దీనిపై మహేష్ నుండి ఎటువంటి సమాచారం లేదు. ఇక కృష్ణ గారు సైతం ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించరాదని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. ఆయన సతీమణి విజయ నిర్మల మరణించి ఏడాది కూడా పూర్తి కాని నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు