నేటి నుంచి మొదలుకానున్న మహేష్ ‘ఆగడు’

Published on Nov 28, 2013 8:44 am IST

Mahesh_Babu_Latest_Pics

సూపర్ స్టార్ హీరోగా నటించనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో మొదటిసారి తమన్నా మహేష్ బాబు సరసన నటించనుంది. మహేష్ బాబు ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. అలాగే తమన్నా కూడా పూర్తి మాస్ పాత్రలో కనిపించనుంది.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ బాబు – శ్రీను వైట్ల – థమన్ – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో 2011లో బ్లాక్ బస్టర్ హిట్ ‘దూకుడు’ వచ్చింది. అదే టీం మళ్ళీ కలిసి చేస్తున్న సినిమా ఇది. ‘ఆగడు’ సినిమా 2014 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :