‘శ్రీమంతుడు’కి హైలైట్ కానున్న మహేష్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్

‘శ్రీమంతుడు’కి హైలైట్ కానున్న మహేష్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్

Published on Jul 22, 2015 5:41 PM IST

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు తన పార్ట్ డబ్బింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అభిమానులు పండగ చేసుకునేలా మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరినీ కట్టి పడేసేలా కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ ఉంటాయని ఇది వరకే తెలియజేశాము.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ చేయని ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడని, అలాగే తను కొన్ని ఎపిసోడ్స్ లో చూపే ఎమోషనల్ పెర్ఫార్మన్స్ సినిమాకి హైలైట్ కావడమే కాకుండా, చూసే ప్రతి ఆడియన్ ఎమోషనల్ గా ఫీలయ్యేలా ఉంటుందని అంటున్నారు. ఎమోషనల్ గానీ కాకుండా ఓవరాల్ స్టొరీ లైన్ ఓ సోషల్ మెసేజ్ చుట్టూ తిరగనుండడం విశేషం. ఈ మెసేజ్ చుట్టూ కొరటాల శివ కమర్షియల్ పాయింట్స్ ని బాగా అల్లుకున్నాడని ఈ చిత్ర టీం చెబుతోంది.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు త్వరలోనే భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు