‘యాత్ర 2’ ఎక్కణ్ణుంచి మొదలవుతుందో తెలుసా !

Published on May 29, 2019 3:02 pm IST

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమాను రూపొందించిన దర్శకుడు మహి వి రాఘవ్ దానికి కొనసాగింపుగా ‘యాత్ర 2’ను చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కొక్కటిగా హింట్స్ ఇస్తూ వస్తున్న ఆయన రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆయన తండ్రి రాజారెడ్డి, కుమారుడు జగన్ లేకుండా సంపూర్ణం కాదంటూ ‘యాత్ర 2’ కథ ఎక్కణ్ణుంచి మొదలవుతుందో చెప్పారు.

యాత్ర సినిమాను జగన్ మీద ముగించడానికి కారణం అయన దగ్గరనుండే యాత్ర 2 మొదలవుతుంది కాబట్టి. వైఎస్సార్ యాత్ర ఆయన తండ్రి రాజారెడ్డి సమాధి వద్ద నుండి మొదలైంది, అలాగే జగన్ యాత్ర కూడా ఆయన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నుండే ఆరంభమైంది అంటూ తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర దగ్గర్నుండే రెండవ పార్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ భాగంలో పార్టీ పెట్టినప్పటి నుండి ముఖ్యమంత్రి అయ్యేవరకు జగన్ రాజకీయ జీవితంలోని అనేక ఒడిదుడుకుల ప్రస్తావనలు ఉండనున్నాయి. ఇకపోతే ఇందులో జగన్ పాత్రను ఏ నటుడు చేస్తాడు అనేదే ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

సంబంధిత సమాచారం :

More