బాక్సాఫీస్ వద్ద కొంచెం పెరిగిన “మైదాన్” వసూళ్లు!

బాక్సాఫీస్ వద్ద కొంచెం పెరిగిన “మైదాన్” వసూళ్లు!

Published on Apr 21, 2024 7:32 PM IST

బాలివుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ ఈ ఏడాది సైతాన్ (shaitaan) చిత్రం తో సూపర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే తాజాగా ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన మైదాన్ (maidaan) మూవీ థియేటర్ల లోకి వచ్చింది. ఈ చిత్రం కి మంచి రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం శనివారం రోజున 2.83 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకూ 32.64 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

నేడు ఆదివారం కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియమణి మరొక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు