‘రష్మిక’ వీడియో కేసులో నిందితుడు అరెస్ట్

‘రష్మిక’ వీడియో కేసులో నిందితుడు అరెస్ట్

Published on Jan 20, 2024 8:05 PM IST

హీరోయిన్ రష్మిక మందన్నాకి సంబంధించి ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ మార్ఫింగ్‌ వీడియో ఆన్‌ లైన్‌ లో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియో అప్ లోడింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ డీప్‌ఫేక్‌ వీడియో కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. అతడే రష్మిక వీడియోను సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. గతేడాది. నవంబర్ 10న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి.. ఆమెను బాధ పెట్టారంటూ కేసు నమోదు అయ్యింది. చూడటానికి అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ వీడియో పై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు