‘సర్కారు వారి పాట’లో ప్రధానాంశాలు !

Published on May 31, 2020 4:41 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’లో లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ లుక్ లో ముందెప్పుడూ చూడని మాస్ లుక్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సినిమా ఇంతకీ ఏ అంశం పై ఉండనుంది ? టైటిల్ ను బట్టి రాజకీయ అంశాల పై ప్రధానంగా సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. సిని వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారట. అలాగే ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే సూపర్ స్టార్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రాశారని అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి. అన్నట్టు మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూ తో ఇయర్ రింగ్ పెట్టుకుని మహేష్ కొత్త యాంగిల్ లో కనిపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More