
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఇటీవల ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చారు. ఓపెనింగ్స్ తో హావా సృష్టించిన ఈచిత్రం తరువాత నెమ్మదించడంతో యావరేజ్ చిత్రం గానే మిగిలిపోయింది. ఇక ఈచిత్రం తరువాత చైతు నటించిన ‘సవ్యసాచి’ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈచిత్రం విజయం సాధించి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుందని చైతు తోపాటు అక్కినేని అభిమానులు ధీమాగా వున్నారు.
ఇక ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం అలాగే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడడంతో చిత్రం ఫై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 27న గ్రాండ్ గా జరుగనుంది. చందు మొండేటి తెరకెక్కించిన ఈచిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. నవంబర్ 2న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.