స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘చెక్కచివంతవానం’ అనే సినిమా చేసున్నారు. తెలుగులో ‘నవాబ్; అనే తిట్లేర్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా సగం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో అరవిందస్వామి, విజయ్ సేతుపతి, శింబు, అదితిరావ్ హైదరి’ వంటి స్టార్ నటీ నటులకు నటిస్తున్నారు.
వీరిలో అరవిందస్వామి రాజకీయనాయకుడు పాత్రలో కనిపించనుండగా అదితిరావ్ మాత్రం పురుషాధిక్య సమాజంలోని బలమైన స్త్రీగా, శింబు ఇంజనీర్ పాత్రలో, విజయ్ సేతుపతి పోలీసాఫీసర్ గా, అరుణ్ విజయ్ ప్రతి నాయకుడి పాత్రలోను కనిపించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


