‘మేజర్’ అనౌన్స్మెంట్ తో వస్తున్న “మేజర్” టీం.!

Published on Mar 14, 2021 1:55 pm IST

తెలుగు సినిమాలో న్యూ ఏజ్ సినిమాలు తన పెన్ పవర్ తో పరిచయం చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. క్షణం, ఎవరు, గూఢచారి లాంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీతో వస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “మేజర్”.

పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది. మరి ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేసింది ఈ చిత్ర యూనిట్. ఇప్పుడు ఇదిలా ఉండగా రేపు ఉన్ని కృష్ణన్ జయంతి సందర్భంగా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్టుగా తెలుపుతున్నారు.

రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల ఎలాంటి ఇన్స్పైరింగ్ అప్డేట్ ను ఇస్తారో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని శశి కిరణ్ దర్శకత్వం వహించగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు శరత్ చంద్రలు సహా సోనీ పిక్చర్స్ వారు మొట్ట మొదటిసారిగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే జూలై రెండున విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :