‘పుష్ప – 2’ రిలీజ్ వాయిదా పై మేకర్స్ క్లారిటీ

‘పుష్ప – 2’ రిలీజ్ వాయిదా పై మేకర్స్ క్లారిటీ

Published on Jan 27, 2024 12:34 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియన్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఫాహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇక తమ మూవీని ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ కొన్ని కారణాల వలన వాయిదా పడనుందని రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతుండడంతో తాజాగా పుష్ప టీమ్ ఆ రూమర్స్ పై స్పందించింది. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, పక్కాగా తమ మూవీ ముందుగా ప్రకటించిన మాదిరిగా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు