‘ఓజి 2’పై సాలిడ్ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

‘ఓజి 2’పై సాలిడ్ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

Published on Jun 11, 2026 8:12 PM IST

OG

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.

తాజాగా మేకర్స్ ఈ విషయంపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ‘మేము మాట ఇచ్చినట్లుగానే ఆయన (పవన్) వస్తారు. టైమింగ్ ఎప్పుడనేది ఆయనే మాకు చెప్తారు. దర్శకుడు సుజీత్ విదేశాల నుండి తిరిగి రాగానే, మేము దీనిపై చర్చలు జరుపుతాం’ అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమాలకు చిన్న బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో ‘ఓజి 2’ ఆగిపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు ఈ అప్‌డేట్ పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఇక ఈ అప్డేట్‌తో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు