గ్రాండ్ గా “కల్కి” ఈవెంట్ ను ప్లాన్ చేసిన టీమ్!

గ్రాండ్ గా “కల్కి” ఈవెంట్ ను ప్లాన్ చేసిన టీమ్!

Published on May 21, 2024 2:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటాని లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం లో బుజ్జి రోల్ చాలా కీలకం అని తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ భైరవ తో బుజ్జి కి ఉన్న రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇస్తూ ఒక వీడియో ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బుజ్జి రోల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ పై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

హైదరబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మే 22, 2024 న సాయంత్రం 5:00 గంటలకు జరిగే ఈవెంట్ లో బుజ్జి మరియు భైరవ రోల్స్ ను రివీల్ చేయనున్నారు. ఇందుకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు