‘జన నాయగన్’ చిత్రంపై మేకర్స్ కొత్త ఆలోచన.. అందులోనూ రిలీజ్..?

Jana-Nayagan

తమిళ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్నారు. అందాల భామ పూజా హెగ్డే, మమితా బైజు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాను పొంగల్ కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ చిత్రాన్ని ఐమాక్స్ వెర్షన్‌లోనూ గ్రాండ్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం వారు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట. విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని గుర్తుండిపోయే సినిమాగా మలిచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version