టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ అనే సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను మెహర్ తేజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఆల్కహాల్ చిత్రాన్ని 2026 న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ, 2026 ఇప్పటికే సగానికి చేరుకోబోతోంది. దీంతో అసలు ఆల్కహాల్ సినిమాపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
సితార వంటి బ్యానర్ నుండి వస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు అయోమయానికి గురవుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుండి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్, గిరీష్ కుల్కర్ణి ముఖ్య పాత్రలు పోషించారు.


