లేటెస్ట్ : SSMB 28 టీమ్ నుండి సూపర్ అప్ డేట్

లేటెస్ట్ : SSMB 28 టీమ్ నుండి సూపర్ అప్ డేట్

Published on May 25, 2023 9:04 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 28. మహేష్ బాబు మాస్ యాక్షన్ పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ని మే 31 సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి రోజున విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ తెలిపారు. అయితే ఆ రోజు కోసం సూపర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా వారికి వారికి నేడు మంచి న్యూస్ అందించారు మేకర్స్. లోడింగ్ అంటూ పవర్ఫుల్ ఎమోజిని జత చేసి కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేసారు మేకర్స్. కాగా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ తాలూకు అప్ డేట్ రేపు రానుందని అంటున్నాయి సినీ వర్గాలు. మొత్తంగా మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ క్రేజీ కాంబో మూవీ 2024 జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు