“ఫ్యామిలీ స్టార్” బ్లాక్ బస్టర్ హిట్ కావాలని విష్ చేసిన మాళవిక మోహనన్!

“ఫ్యామిలీ స్టార్” బ్లాక్ బస్టర్ హిట్ కావాలని విష్ చేసిన మాళవిక మోహనన్!

Published on Mar 28, 2024 10:30 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family star). ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ రాగా, ట్రైలర్ తో సినిమా పై మరింత అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం ట్రైలర్ ను చూసిన హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika mohanan) సోషల్ మీడియా వేదిక గా చిత్త యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపింది. తన ఫ్యామిలీ స్టార్ K.U. మోహనన్ సినిమాను షూట్ చేశారు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి K.U. మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని విష్ చేశారు. అంతేకాక సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మృణాల్ ఠా కూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు