విజయ్ ‘ఫైటర్’లో మలయాళ స్టార్ నటుడు ?

Published on Nov 26, 2020 12:03 am IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రం ‘ఫైటర్’. మొదటిసారి డాషింగ్ డైరెక్టర్, డాషింగ్ హీరో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘ఫైటర్’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. పూరి సైతం ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్ లెవల్లో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాలో విజయ్ కిక్ బాక్సర్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ముఖ్యమైన రోల్ కోసం మలయాళ స్టార్ నటుడు సురేష్ గోపిని ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే సురేష్ గోపి కోసం ప్రత్యేకమైన పాత్రే ఉంటుందనడంలో సందేహం లేదు.

అలాగే ఇంకొక ముఖ్యమైన రోల్ కోసం స్టార్ నటి రమ్యకృష్ణను తీసుకున్నారు. ఆ పాత్ర కోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. చూడబోతే పూరి ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఛార్మీతో కలిసి పూరి నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ సైతం నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. లాక్ డౌన్ మూలంగా ఆగిపోయిన చిత్రీకరణను రీస్టార్ట్ చేయడానికి ముంబైలో సన్నాహాలు చేస్తున్నారు పూరి.

సంబంధిత సమాచారం :

More