ప్రత్యేకం : కామెడీ ప్రియుల కోసం 123తెలుగు.కామ్ అందిస్తున్న ‘కిర్రాక్’ కామెడీ షో

ప్రత్యేకం : కామెడీ ప్రియుల కోసం 123తెలుగు.కామ్ అందిస్తున్న ‘కిర్రాక్’ కామెడీ షో

Published on Jul 23, 2014 12:10 PM IST

kirrak1
మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ పేరు వినగానే మొదటగా టాలీవుడ్ లో రికార్డ్స్ సృష్టించిన ‘అంకుశం’, ‘అమ్మోరు’, ‘అరుంధతి’ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. 1964లో సినీ పరిశ్రమకు పరిచమైన ఈ బ్యానర్ గత 50 సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థగా వెలుగొందుతోంది. కేవలం కమర్షియల్ సినిమాలను అందించడమే కాకుండా హాలీవుడ్ స్థాయిని మరపించేలా గ్రాఫిక్స్ ని కూడా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత కూడా మల్లెమాల నిర్మాణ సంస్థకే దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మల్లెమాల కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా రొటీన్ కి భిన్నంగా సరికొత్త ఐడియాలతో సీరియల్స్ మరియు రియాలిటీ షోలతో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకే రకమైన మూస రియాలిటీ షోస్ వస్తున్న రోజుల్లో మల్లెమాల చేసిన ‘ఢీ’ డాన్స్ షో సీరీస్ ఇప్పుడు తెలుగులో వచ్చే ఎన్నో డాన్స్ షోస్ కి స్ఫూర్తి నిచ్చింది. అంతే కాకుండా ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’, ‘జీన్స్’, ‘క్యాష్’, ‘స్టార్ మహిళ’ షోస్ వేటికవే వైవిధ్యాన్ని చాటుకొని తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్నడూ రాని కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ‘జబర్దస్త్’ మాత్రం ఒక ఎత్తు. ‘జబర్దస్త్’ కామెడీ షో టెలివిజన్ రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ కామెడీ షో టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక టి.ఆర్.పి రేటింగ్స్ సాధించి రికార్డ్ సృష్టించడమే కాకుండా, సోషల్ మీడియా అయిన యు ట్యూబ్ లో ప్రపంచంలో కూడా అత్యధిక క్లిక్స్ పొంది రికార్డ్ సాధించింది.

ఇప్పటి వరకూ వెండితెర, బుల్లితెర ప్రేక్షకులని మాత్రమే ఎంటర్టైన్ చేసిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ మొదటి సారిగా మన 123telugu.com ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి ప్రత్యేకంగా ‘కిర్రాక్’ కామెడీ షోని రూపొందించింది. సినిమాలలో, టీవీ చానల్స్ లో బాగా ఫేమస్ అయిన పాపులర్ కమెడియన్స్ ఈ షోలో మిమ్మల్ని తెగ నవ్వించనున్నారు. ఈ కామెడీ షోకి ఫేమస్ అండ్ ఎనర్జిటిక్ యాంకర్స్ అయిన అనసూయ – రవి జడ్జ్ లుగా వ్యవహరించనున్నారు. కేవలం మన 123తెలుగు.కామ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కామెడీ షోని మీరు 123telugu.com వెబ్ సైట్ లేదా MallemalaTv అనే యు ట్యూబ్ చానల్లో మాత్రమే చూడగలరు. ఎప్పటిలానే మరి కొద్ది రోజుల్లో మేము ప్రారంభించనున్న ఈ ప్రోగ్రాంని కూడా బాగా ఆదరించి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం..

తాజా వార్తలు