“మల్లేశం” మూవీ ట్రైలర్ -ఓ సామాన్యుని అసామాన్య గాధ

Published on May 29, 2019 5:48 pm IST

కామెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారం తెరకెక్కిన మూవీ “మల్లేశం”. నేడు విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.
పెద్దగా చదువులేని, అల్లరిచిల్లరిగా తిరిగే మల్లేశం తల్లి ఏళ్ల తరబడి ఆసుపని చేసి, చివరకు తన చేతులు పోగొట్టుకునే స్థితికి చేరుతుంది.ఇది తెలుసుకున్న మల్లేశం ఎలాగైనా తల్లి పనిని తేలిక చేయడానికి, ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఒడిడుకులు. అన్ని అవరోధాలు అధిగమించి మల్లేశం తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అన్న సంఘటన సమాహారమే ఈ “మల్లేశం” అని తెలుస్తుంది.

ట్రైలర్ లో మల్లేశంగా ప్రియదర్శి బాగా చేసాడు, మల్లేశం తల్లిగా ఝాన్సీ నటించారు. ఇక అందరూ దాదాపు కొత్త నటులే. ట్రైలర్ చాలా బావోద్వేగంగా మనసుకి హత్తుకునేలా వుంది. ప్రియదర్శి కి భార్యగా అనన్య చేసిన ఈ మూవీకి రాజ్ ఆర్ దర్శకత్వం వహించగా,శ్రీ అధికార్ నిర్మించారు. మార్క్ కే రాబిన్ సంగీతం సమకూర్చారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More