
‘రన్ రాజా రన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ చేస్తున్న కొత్త మూవీ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. శర్వానంద్ ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని ఫినిష్ చెయ్యడమే కాకుండా ఈ సినిమా ఆడియోని కూడా రిలీజ్ చేసారు. నిన్ననే ఈ సినిమా ఆడియో రిలీజ్ హైదరబాద్ లోని తాజ్ డెక్కన్ లో చాలా స్టైలిష్ గా లాంచ్ చేసారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా నిత్యా మీనన్ నటించింది.
ఈ సినిమాలో శర్వానంద్ రన్నర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి మిగిలి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘ఓనమాలు’ ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎ వల్లభ నిర్మిస్తున్నాడు. అన్నీ పనులను పూర్తి చేసి డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

