ఓటీటీలోకి వచ్చేసిన మమితా సంచలన హిట్.. ఇక నుంచి వేరే లెక్కలో ఉంటుందా!

ఓటీటీలోకి వచ్చేసిన మమితా సంచలన హిట్.. ఇక నుంచి వేరే లెక్కలో ఉంటుందా!

Published on Oct 2, 2026 7:00 AM IST

ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ మమితా బైజు నుంచి ఇటీవల వచ్చిన మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమానే బెత్లెహోమ్ కడుంబా యూనిట్. ప్రేమమ్ హీరో నివిన్ హీరోగా దర్శకుడు గిరీష్ తెరకెక్కించిన ఈ రోమ్ కామ్ డ్రామా 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సెట్ చేసింది. ఇలా మోలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమా లవర్స్ ఓటీటీ లోకి వచ్చాక కూడా విజృంభిస్తారో లేదో చూడాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ సినిమా ఫ్యాన్స్ రచ్చ గత రెండు రోజులు నుంచే మొదలైంది. సో ఇక్కడ రెస్పాన్స్ మాత్రం వేరే లెక్కలోనే ఉంటుంది అని చెప్పవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు