షేక్స్పియర్ విలన్ టైటిల్ తో సూపర్ స్టార్ మూవీ

షేక్స్పియర్ విలన్ టైటిల్ తో సూపర్ స్టార్ మూవీ

Published on Jul 16, 2019 1:00 PM IST

మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి మరో వినూత్న చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. “షైలాక్-ది మనీ లెండర్”అనే చిత్రంలో ఆయన నటిస్తున్నట్లుగా ధృవీకరిస్తూ నేడు టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఐతే ఆసక్తికరంగా ఈ మూవీ టైటిల్ గా ప్రఖ్యాత నవలాకారుడు విలియం షేక్స్పియర్ అద్భుత నవలలో ఒకటైన “మర్చెంట్ ఆఫ్ వెనిస్” లోని విలన్ పాత్ర పేరైన “షైలాక్” అని పెట్టారు. షేక్స్పియర్ రాసిన అనేక నవలలో “మర్చెంట్ ఆఫ్ వెనిస్” అనే నవల అత్యంత ప్రాచుర్యం పొందింది. శతాబ్దాలుగా ఈ కథని అనేక వేదికలపై ప్రదర్శించడంతో పాటు, హాలీవుడ్ లో సినిమాగా కూడా తీయడం జరిగింది.

లవ్ రొమాంటిక్ నవల అయిన “మర్చెంట్ ఆఫ్ వెనిస్” లో షైలాక్ ప్రధాన విలన్. వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను హింసించే పిసినారిగా ఆయన పాత్ర ఉంటుంది. మరి అలాంటి పాత్ర పేరును మమ్ముట్టి చిత్రానికి పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్ విల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జోబి జార్జ్ నిర్మిస్తుండగా,గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు