275 రోజుల తర్వాత ఇంటి నుంచి బయటికొచ్చిన స్టార్ హీరో

275 రోజుల తర్వాత ఇంటి నుంచి బయటికొచ్చిన స్టార్ హీరో

Published on Dec 8, 2020 3:00 AM IST


మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి ఉన్న గొప్ప లక్షణాల్లో పట్టుదల కూడ ఒకటి. ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే చేసి తీరుతారాయన. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గరు. ఆ పట్టుదలనే కరోనా సమయంలో మరోసారి చూపెట్టారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంట్లోంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు సూచించారు. అప్పుడే కరోనాను జయించగలమని అన్నారు. దీంతో మమ్ముట్టి దాన్ని సవాల్ గా స్వీకరించారు. ఎన్ని రోజులు ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండగలనో చూసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఈ సంగతిని ఆయన తనయుడు, ప్రముఖ జీరో దుల్కర్ సల్మాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత మమ్ముట్టి 275 రోజులు అనగా పూర్తిగా తొమ్మిది నెలలపాటు ఇంటికే పరిమితమైపోయారు. ఏ పరిస్థితుల్లోనూ బయటకు రాలేదు. 9 నెలలు పూర్తికాగానే గత శుక్రవారం బయటకొచ్చి స్నేహితులని కలిసి సరదాగా టీ సేవించారు. నిత్యం జనంలో ఉండే ఒక స్టార్ హీరో ఇలా ఏకధాటిగా తొమ్మిది నెలలు ఇంట్లోనే ఉండిపోవడమనేది విశేషమే అనాలి. ఈ 9 నెలలు ఆయన ఫిట్నెస్ మీద దృష్టిపెట్టారట. తిరిగి షూటింగ్లో కూడ పాల్గొంటున్న ఆయన మరింత జాగ్రత్త కోసం సొంత క్యారవాన్ తయారుచేయించుకున్నారు కూడ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు